ఎట్లాస్ట్ ద షో ఈజ్ ఆన్
స్క్రిప్ట్ లేని డైలాగులా? సో వాట్
నంబరు 8 ఎన్నోసార్లు రాదు. 8 లేదా 17 లేదా 26 మాత్రమే. మనకు 35, 44, 53 తేదీలు కాలెండరులో లేవు కదా. ఒక్కొక్కరికి ఒక్కో నంబరు అదృష్టాన్నిస్తుంది. అయితే ప్రజలకు అచ్చొచ్చే నంబరే తెలుగు వాళ్ళకు ఇంకా తెలీదు
ఈరోజు చిరంజీవికి ముప్పయి సంవత్సరాలలో లేని నటనానుభవము కలిగి ఉండాలి. ఏమైనా కాకపోయినా ఈ రోజు తన పార్టీ ముసుగులోంచి బయటపదింది. ఎట్టకేలకు బిగ్ బాస్ నేరుగా పత్రికా రంగంతో మాట్లాడి తన రాజకీయ అరంగేట్రం సంబందినంచిన సస్పెన్స్ కి తెర దించారు. తన పార్టీ ఇంకా ఊగిసలాడే అవకాశం లేదని తను నిజంగానే పార్టీ పెడ్తానని తేల్చి చెప్పినట్లయింది.
ఇంకా పేరు లేదు, దిశ లేదు! మరో మంచి ముహూర్తం ఉంది. అప్పుడే అంత తొందర ఎందుకు అన్నట్లు ఇది చిరు రాజకీయ ప్రారంబోత్సవం మాత్రమే
అందరికీ కావాలసినవన్నీ ఉన్నాయి తన జోలెలో. అంబేద్కర్, గాంధీ, మదర్ థెరెస్సా, ఫూలే చిత్రపటాలు కూడా ఉన్నయి. ఇంకేమి కావాలి. కాని సూటిగా ఒక్క మాట ఇంకా లేదు.
తనకు కాంగ్రేసు, తెలుగు దేశం పార్టీలు రైవల్స్ కాదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో ప్రజల అభీష్టం మేరకు తన పార్టీ కార్యక్రమం ఉంటుందని దాటవేసే కుప్పిగంతులను ప్రదర్శించారు. పరిస్థితి మరో లక్కీ నంబరుకు మారుతుందని అనుకోవాల్సిన అవసరము లేదు.
స్క్రిప్ట్ లేని డైలాగులు చెప్పమంటె నటులకుండె ఇబ్బంది ఏంటో పదహారణాలు కనిపించిందీ ఈరోజు పత్రికా సమావేశంలో. తన పార్టీలో సోషల్ జస్టీస్ తో పాటు పొలిటికల్ జస్టీస్ కూడా ఉంటుందని వినూత్న ప్రతిపాదన చేయడంతోపాటు నేను ‘రైటిజం’ లెఫ్టిజం కాదు నాది హ్యూమనిజం అని తన పార్టీ రాజకీయాలను పరిచయం చేసారు. తన పార్టీకి ఎన్ని సీట్లొస్తాయనేది ఇప్పుడే ఎందుకనీ, ఎవరితో పొత్తు పెట్టుకొనేది ఇప్పుడె చెప్పలేమనీ తన పార్టీ ఇంకా అయోమయం నుంచి బయటపడలేదనీ స్పష్టం చేశారు.
తన ఆత్మ విశ్వాసం, మహిళల అండ, యూతు అండ, అన్ని పార్టీల్లోని తన అభిమానుల అండ తనను ఉత్తేజం, తేజోవంతం చేసిందనీ సవినయంగా చెప్పారు. తన మంచితనము తన సెన్సిటీవ్నెస్ తనకు కొండంత బలానిస్తుందని విశ్వాసం ప్రకటించారు. (ఇంకా…)







