ఎట్లాస్ట్ ద షో ఈజ్ ఆన్
 
స్క్రిప్ట్ లేని డైలాగులా? సో వాట్

నంబరు 8 ఎన్నోసార్లు రాదు. 8 లేదా 17 లేదా 26 మాత్రమే. మనకు 35, 44, 53 తేదీలు కాలెండరులో లేవు కదా. ఒక్కొక్కరికి ఒక్కో నంబరు అదృష్టాన్నిస్తుంది. అయితే ప్రజలకు అచ్చొచ్చే నంబరే తెలుగు వాళ్ళకు ఇంకా తెలీదు

ఈరోజు చిరంజీవికి ముప్పయి సంవత్సరాలలో లేని నటనానుభవము కలిగి ఉండాలి. ఏమైనా కాకపోయినా ఈ రోజు తన పార్టీ ముసుగులోంచి బయటపదింది. ఎట్టకేలకు బిగ్ బాస్ నేరుగా పత్రికా రంగంతో మాట్లాడి తన రాజకీయ అరంగేట్రం సంబందినంచిన సస్పెన్స్ కి తెర దించారు. తన పార్టీ ఇంకా ఊగిసలాడే అవకాశం లేదని తను నిజంగానే పార్టీ పెడ్తానని తేల్చి చెప్పినట్లయింది.

ఇంకా పేరు లేదు, దిశ లేదు! మరో మంచి ముహూర్తం ఉంది. అప్పుడే అంత తొందర ఎందుకు అన్నట్లు ఇది చిరు రాజకీయ ప్రారంబోత్సవం మాత్రమే

అందరికీ కావాలసినవన్నీ ఉన్నాయి తన జోలెలో. అంబేద్కర్, గాంధీ, మదర్ థెరెస్సా, ఫూలే చిత్రపటాలు కూడా ఉన్నయి. ఇంకేమి కావాలి. కాని సూటిగా ఒక్క మాట ఇంకా లేదు.
 

తనకు కాంగ్రేసు, తెలుగు దేశం పార్టీలు రైవల్స్ కాదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో ప్రజల అభీష్టం మేరకు తన పార్టీ కార్యక్రమం ఉంటుందని దాటవేసే కుప్పిగంతులను ప్రదర్శించారు. పరిస్థితి మరో లక్కీ నంబరుకు మారుతుందని అనుకోవాల్సిన అవసరము లేదు.
   
స్క్రిప్ట్ లేని డైలాగులు చెప్పమంటె నటులకుండె ఇబ్బంది ఏంటో పదహారణాలు కనిపించిందీ ఈరోజు పత్రికా సమావేశంలో. తన పార్టీలో సోషల్ జస్టీస్ తో పాటు పొలిటికల్ జస్టీస్ కూడా ఉంటుందని వినూత్న ప్రతిపాదన చేయడంతోపాటు నేను ‘రైటిజం’ లెఫ్టిజం కాదు నాది హ్యూమనిజం అని తన పార్టీ  రాజకీయాలను పరిచయం చేసారు. తన పార్టీకి ఎన్ని సీట్లొస్తాయనేది ఇప్పుడే ఎందుకనీ, ఎవరితో పొత్తు పెట్టుకొనేది ఇప్పుడె చెప్పలేమనీ తన పార్టీ ఇంకా అయోమయం నుంచి బయటపడలేదనీ స్పష్టం చేశారు. 

తన ఆత్మ విశ్వాసం, మహిళల అండ, యూతు అండ, అన్ని పార్టీల్లోని తన అభిమానుల అండ తనను ఉత్తేజం, తేజోవంతం చేసిందనీ సవినయంగా చెప్పారు. తన మంచితనము తన సెన్సిటీవ్నెస్ తనకు కొండంత బలానిస్తుందని విశ్వాసం ప్రకటించారు.

అంతవరకు బాగానే ఉంది. ప్లీజ్ ప్లీజ్ అని పది సార్లనడము, చెమటలు పోయడము మొత్తంగా బాడీ లాంగ్వేజ్ చిరంజీవి ఇంకా సినిమా నుంచి రాజకీయాల్లోకి ఎవాల్వ్ కాలేదని చెప్తుంది. రిహార్సలు సరిగా లెవేమో చాలా టేక్స్ అవసరమని ఎవరికైనా తెలుస్తుంది. ఎన్నిసార్లు చిరునవ్వులు పులుముకొన్నా ప్రజలే నా గురువులు, వారే అన్నీ చెప్తారు, వారే పొత్తులను జిత్తులను నేర్పుతారని ఇంకా చిలక పలుకులు చెప్పే దశనుంచి  కావల్సినంతగా రాజకీయాల్లోకి చిరంజీవి ఎదగాలేదని చెప్పకనే చెప్పుతాయి

ప్రజలు తెరపైన నటుల్లో మార్పును కోరి ఎంతోమంది హీరోలున్నా తనను ఆహ్వానించినట్లు ఆదరించినట్లు ఈ రోజు రాష్ట్రంలొ పొలిటికల్ వాక్యుం ఉందన్న మాట వాస్తవేమేనని చెప్పినా తన పార్టీ ప్రస్థుతమున్న పార్టీలకన్నా పూర్తిగా భిన్నమైన విధానాలు చేపట్టకపోయిన ఉన్న విధానాలనే అమలు చేయడంలో అత్యంత నిరుపేదకు అందడం విషయంలో ప్రత్యేకంగా నిలుస్తందని హామినిస్తున్నారు. ఓల్డ్ పాలసీలైనా బెస్ట్ ఇంప్లిమెంటేషం అన్నమాట! ఆమేరకైనా హర్షనీయమే.

ఇంత కాలం చిత్రరంగంలో అందరివాడిగా ఉన్న చిరంజీవి రాజకీయాల్లో కొందరివాడిగా కుదించుకుపోడని చిరంజీవి నమ్మకం.

అవినీతిని తుడిచిపెట్టే టాగోర్ పాత్రకు అద్ధం పట్టే విధంగా రాజకీయాల్లోకి వొచ్చిన తన పార్టీలో పాత కాంగ్రేసు తెలుగు దేశం నాయకులు కొందరు ఎలా చేరుతున్నారన్న ప్రశ్నకు మాత్రం ఇంస్టంట్ జవాబు లేదు.

రాష్ట్ర రాజకీయాల్లో పాత డైలాగైన ‘మేధోమధనం’, ‘శాస్త్రీయ అద్యయనం’ కూడ తరుచూ వినిపించడము చిరు పార్టీలో కొత్తదనమూ పెద్దగా ఉండదేమోనన్న అభిప్రాయానికి బలాన్నిస్తుంది.     

తమ పార్టీ గెల్చినా గెల్వకపోయినా రాష్ట్ర రాజకీయాలను తలకిందులచేసే వాళ్ళలో దేవేందర్ గౌడ్ తో పాటు చిరంజీవని పలువురు భావిస్తున్నారు. 

ఇవ్వాల్టి షో పోస్టర్ మాత్రమే. అసలు షో 26న ఉంది.

 

– మామిడి భరత్ భూషణ్

ప్రకటనలు