పోలవరం సంక్షోభం ఎస్ ఈ డబ్ల్యూ కి పరిమతమైతే బానే ఉండేది. ఇది మరో గోదారి స్పెక్ట్రం కుంభకోణం లెక్క అవినీతి, ఆరోపణలు, విచారణలు. వాస్తవాలు తేలినతర్వాత దొరలెవరో దొంగలెవరో నల్గురు వార్తలు చదివి పుర్సత్తుగా మాట్లాడుకొంటరు.

కథ అక్కడ ఆగలేదు. కనుకనే చర్చ. విమర్శ. ఖండనలు. పోలవరం వివాదంలో ఎన్నెన్ని రాజకీయాలో. ప్రస్థుతానికి కొన్నింటిని తప్పనిసరిగా ఆలోచించాలి.

ప్రశ్న ఏంది? జలయగ్నం పేరుతో సాగిన బలియగ్నంలో వాటదారులైన కాంట్రాక్టరు (ఎస్ ఈ డబ్ల్యు) టీ ఆర్ ఎస్ కు బంధువెట్లాయె? నాలుగు పైసలకోసం ఓ క్రిమినల్ ప్రాజెక్టును కట్టి తూర్పు కనుమలను, కోయ జాతిని ఖూని చేసేందుకు ఉవ్వీల్లూరే కాంట్రక్టర్లు పోలవరం మీద యుద్దమే చేసే వాళ్ళకు మిత్రులెట్లాయె. నమస్కారం చేయడానికి ముఖ్యుడెట్లాయే (మరింత…)

ప్రకటనలు